శ్రీశైలం ఘాట్ రోడ్డులో యాక్సిడెంట్..ఒకరికి తీవ్ర గాయాలు, 18 మందికి  స్వల్ప గాయాలు

శ్రీశైలం ఘాట్ రోడ్డులో యాక్సిడెంట్..ఒకరికి తీవ్ర గాయాలు, 18 మందికి  స్వల్ప గాయాలు

అమ్రాబాద్, వెలుగు: శ్రీశైలం ఘాట్​ రోడ్డులో శుక్రవారం రాత్రి మినీ ట్రావెల్స్ వాహనం, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరో 18 మందికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితుల వివరాల ప్రకారం, హైదరాబాద్ ఘట్​కేసర్ ప్రాంతానికి చెందిన కుటుంబ సభ్యులు దైవ దర్శనం కోసం మైసిగండి, మద్దిమడుగు దేవాలయాలకు వెళ్లి అక్కడి నుంచి శ్రీశైలం బయలుదేరారు. 

వరవర్లపల్లి సమీపంలోని రాసుమల్ల బాబి వద్ద ఎదురుగా వస్తున్న మహబూబ్‌‌‌‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 18 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను అచ్చంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.